ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో సవరణ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో సవరణ

May 14 2026 12:43 AM | Updated on May 14 2026 12:43 AM

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అంతర్గత రిజర్వేషన్‌ను తాత్కాలికంగా 17 శాతం నుంచి 15 శాతానికి పరిమితం చేసి అమలుకు ఆదేశాలిచ్చింది. ఈ రిజర్వేషన్‌లను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరికి 5.25 శాతం, బీ కేటగిరికి 5.25 శాతం, సీ కేటగిరికి 4.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఒకవేళ ఆయా వర్గాల నుంచి అభ్యర్థులు లేని పక్షంలో మిగతా వర్గం అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేసుకోవచ్చని తెలిపింది.

కొత్తగా ఉద్యోగాల భర్తీ

ఈ నేపథ్యంలో జారీ అయిన ఉద్యోగ నోటిఫికేషన్‌లను రద్దు చేసి, కొత్త అంతర్గత రిజర్వేషన్‌ నియమాల ప్రకారం నోటిఫికేషన్‌లు ఇవ్వాలని ఆదేశించింది. 56,432 ఉద్యోగాల నియామకాలకు ఇటీవల ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం భర్తీకి త్వరలో ప్రకటన ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement