తల్లికి సేవ చేయాలి | - | Sakshi
Sakshi News home page

తల్లికి సేవ చేయాలి

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

రాయచూరు రూరల్‌: ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. కుమారులు తల్లిని పూజించి, సేవ చేయాలని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. ఆదివారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి కుటుంబ కోసం నిత్యం శ్రమిస్తుందన్నారు. తల్లి చూపే త్యాగం, ప్రేమ, కరుణను గుర్తు చేసుకోవాలన్నారు. పిల్లలకు మానవతా విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు బోధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రవీంద్ర జాలదార్‌, శారద తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన

ఉద్బవ లింగ ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా గాణదాళలో ఆదిశేష ఉద్బవ లింగ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం సాయంత్రం కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్యులు, హోసళ్లి ముత్యా మహంత శివయోగి మహాస్వామి, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్‌ ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కలసి రథాన్ని లాగారు.

వీడియోతో

మహిళకు బ్లాక్‌మెయిల్‌

హుబ్లీ: యువతిపై లైంగిక దాడి చేసిన వీడియోలను ఇతరులకు మొబైల్స్‌కు పంపిన యువకుడిపై ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్న 21 ఏళ్ల యువతి నవనగర అబ్దుల్‌ మాలిక్‌పై ఫిర్యాదు చేసింది. గతంలో ఈమె ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇంటర్యూకు వెళ్లిన సమయంలో అబ్దుల్‌ మాలిక్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసుకుని ఇతరుల మొబైల్స్‌కు పంపించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

వాల్మీకి విగ్రహావిష్కరణ

రాయచూరు రూరల్‌: నాయక్‌ సమాజం విద్యలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మాన్వి తాలూకాలోని బల్లటిగిలో మహర్శి వాల్మీకి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహర్శి వాల్మీకి జీవత చరిత్రను అందరూ తెలుసుకోవాలని సూచించారు. మానవతా ధర్మం ఆధారంగా మహర్శి చేసిన సేవలు అనన్యమన్నారు. నాయక్‌ సమాజం చేస్తున్న సేవలు ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తు తరాల వారికి గుర్తుండేలా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లోకసభ సభ్యుడు కుమార నాయక్‌, మాన్వి శాసన సభ సభ్యుడు హంపయ్య నాయక్‌, ప్రసన్నానంద స్వామి, వరదానేంద్ర, గంగాధర నాయక్‌, రవి, అమరేష్‌, రుద్రప్ప అంగడి, కేశవ మూర్తి, సూగుప్ప, గంగారెడ్డి, గపూర్‌ పాల్గొన్నారు.

ఫ్లాట్లపై ఫిర్యాదు

సాక్షి, బళ్లారి: నగరంలో ఓ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఓ అపార్టుమెంటులో తాను కొనుగోలు చేసిన ఫ్లాట్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు కేటాయించిన 10 ఫ్లాట్లలో నాణ్యత ఏమాత్రం లేదని వాపోయింది. నిర్మాణదారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెండు రోజుల క్రితం బాడుగులకు ఇచ్చిన షాపులో పై పెచ్చులు ఉడిపోయాయని తెలిపారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

కోలారు: ఉత్తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలను తరచుగా చేయించుకుంటూ ఉండాలని తాలూకా ఆరోగ్య అధికారి డా నారాయణస్వామి తెలిపారు. ఆదివారం నగరంలోని సబ్‌ జైలులో ఖైదీలకు ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. 100 రోజుల క్షయ ముక్త అభియాన్‌ గురించి ఖైదీలకు వివరించారు. అతి వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఎక్కువగా నీరు తాగాలని తెలిపారు. జైలు అధికారి జి రాములు, జైలర్‌ యాస్మిన్‌, ఎస్‌.బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement