దొడ్డబళ్లాపురం: కనకపుర తాలూకా సంగమం వద్ద ఆడ ఏనుగు కన్నుమూసింది. తల్లి ఏనుగు కళేబరం వద్ద గున్న విలపిస్తున్న దృశ్యం అందరికీ బాధను పంచింది. సుమారు 38 సంవత్సరాల వయసు గల ఆడ ఏనుగు తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని అటవీ సిబ్బంది తెలిపారు. సిబ్బంది సోమవారం రాత్రి గస్తీ తిరుగుతుండగా ఏనుగు కళేబరం కనిపించింది. దాని పిల్లతో పాటు మరికొన్ని ఏనుగులు అక్కడే చాలాసేపు ఉండి వెళ్లిపోయాయి. ఆ తరువాత పశు వైద్యాధికారి డా.గిరీష్ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. గున్న ఏనుగును గజ సంరక్షణాలయానికి తరలిస్తారని తెలిసింది.


