హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా యంబలి, వడ్డరహట్టి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం అకస్మాతుగా ప్రారంభమైన ఈదురుగాలులకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో రెండు గదులపై ఏర్పాటు చేసిన రేకుల షీట్ల ట్రస్ రూఫింగ్ పైకప్పు దెబ్బ తింది. ఇప్పుడు పాఠశాలకు సెలవు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైతు చెన్నబసప్పకు చెందిన కోళ్లఫారం షెడ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సందర్భంలో రేకులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. జరిగిన నష్టంపై జీపీ అధికారులు పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నారు.


