బెంగళూరువాసులకు ఈ–ఖాతా అభియాన | - | Sakshi
Sakshi News home page

బెంగళూరువాసులకు ఈ–ఖాతా అభియాన

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

శివాజీనగర: బెంగళూరు నగరంలో భూములు, స్థలాల యజమానులకు సహాయకారిగా ‘నా ఈ–ఖాతా, నా హక్కు’ అనే అభియానను శనివారం డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌ ప్రారంభించారు. తూర్పు నగర పాలికె పరిధిలో హొరమావులో నేషనల్‌ పబ్లిక్‌ పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ 6వ గ్యారంటీగా ఈ పథకాన్ని జారీచేసింది, ఖాతా లేని ఇళ్లు, భవనాల యజమానులు ఇప్పుడు ఈ–ఖాతా పొందవచ్చు. 100 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు.

దరఖాస్తుల పరిశీలన తరువాత ఈ–ఖాతా పంపిణీ చేస్తారు అని తెలిపారు. ఇందుకు ఆస్తి విలువలో 2 శాతం ఫీజుగా చెల్లించాలని చెప్పారు. అలాగే మిగతా నగర పాలికెల్లోనూ డీసీఎం ఈ అభియానకు నాంది పలికారు. జీబీఏ చీఫ్‌ కమిషనర్‌ మహేశ్వరరావు, కమిషనర్లు పాల్గొన్నారు. సర్వజ్ఞనగరలో ఖాతా అభియాన్‌ను కమిషనర్‌ పరిశీలించారు.

తొలిరోజే వందలాదిమంది దరఖాస్తులు చేసుకొన్నారు. ఈ అభియాన 100 రోజులు మాత్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ–ఖాతా పంపిణీ, కొత్తగా ఈ–ఖాతా దరఖాస్తులు చేయడం, బీ–ఖాతా నుంచి ఎ–ఖాతాకు మార్చేందుకు దరఖాస్తులు, విన్నపాల పరిష్కారం తదితరాలు అభియాన కేంద్రాలలో లభిస్తాయని తెలిపారు.

ప్రారంభించిన డీసీఎం శివ

Advertisement
 
Advertisement
Advertisement