మాలూరు: తాలూకాలోని కేజీ హళ్లి గ్రామంలో యవకుడి హత్య కేసులో నిందితులను మాస్తి పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. టీకల్ గ్రామానికి చందిన దర్శన్, సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీ హళ్లి సంత మైదానంలో శనివారం రాత్రి జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్పీ ఆదేశాలతో కార్యాచరణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో సఫలం అయ్యారు. కోర్టులో ఓ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో తెలిసింది.


