పనసమాకనహళ్లిలో నీటి ఎద్దడి | - | Sakshi
Sakshi News home page

పనసమాకనహళ్లిలో నీటి ఎద్దడి

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

శ్రీనివాసపురం: తాలూకాలోని పనస మాకనహళ్లి గ్రామంలో నీటి ఎద్దడి అధికమైంది. గ్రామంలో చాలా వరకు బోర్వెల్‌లు ఎండి పోయాయి. ప్రజలు తాగునీరు లేక నానా ఇబ్బంది పడాల్సి వస్తోంది. వంకలు, వాగులు ఎండిపోవడంతో పశువులకు కూడా నీరు లభించడం లేదు. సుదూరంలో ఉన్న కొళాయిల నుంచి సైకిళ్లపై నీరు తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది గ్రామానికి తరచుగా వచ్చే నీటి ట్యాంకర్‌పై ఆధారపడుతున్నారు. కొత్తగా బోర్వెల్‌ వేసి నీటి సమస్యను పరిష్కరించాలని పీడీఓకు విన్నవించినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరించకుంటే తీవ్ర ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement