రాయచూరు రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలన్నారు. గత నాలుగు నెలల నుంచి గౌరవ వేతనాల్లో ఇచ్చే పారితోషికంలో కోత విధించడాన్ని తప్పుబట్టారు. న్యాయసమ్మతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఈఓకు వినతిపత్రం సమర్పించారు.


