దొడ్డబళ్లాపురం: ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సీఎం కుర్చీ మార్పు, మంత్రివర్గ విస్తరణ రెండు సమస్యలు త్వరలో కొలిక్కి వస్తాయని మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. శనివారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్ అన్ని సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, లేదా అనేది త్వరలో తెలుస్తుందన్నారు. ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ గురించి ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ జరిగిందని, సర్‌పై దేశవ్యాప్తంగా గందరగోళం ఉందన్నారు. సర్ దుర్వినియోగాన్ని అరికట్టడం గురించి చర్చలు జరిగాయన్నారు. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. బెంగాల్‌లో మమత బెనర్జీ ఈ విషయం చర్చకు వచ్చిందన్నారు. తమిళనాడులో టీవీకే విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి తరువాత బలపరీక్షకు సమయం ఇవ్వాలన్నారు.


