బనశంకరి: బెంగళూరు–ముంబై మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం బెంగళూరు బైయప్పనహళ్లి విశ్వేశ్వరయ్య రైల్వేస్టేషన్‌లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వీ.సోమణ్ణ, ఎంపీలు పీసీ.మోహన్, తేజస్విసూర్య ప్రారంభించారు. బెంగళూరు–ముంబై మధ్య ఈ స్టేషన్ నుంచి వారానికి రెండు సార్లు సంచరిస్తుంది. శనివారం, మంగళవారం బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తుంది, ఆదివారం, బుధవారం ముంబై నుంచి బెంగళూరుకు వస్తుంది. హుబ్లీ, ధార్వాడ, బెళగావి, పూణె మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో 17 బోగీలు ఉండగా, ఒక ఏసీ 2 టైర్ , 4 ఏసీ–టైర్, 6 స్లీపర్, 4 జనరల్ బోగీలుంటాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ఎంపీలు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ నుంచి స్వామి వివేకానంద మెట్రోస్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
ముంబైకి హైస్పీడ్ కారిడార్ కావాలి
దావణగెరె, హుబ్లీ మీదుగా బెంగళూరు– ముంబై మధ్య హై స్పీడ్ రైలు కారిడార్‌ను మంజూరు చేయాలని ఎంపీ తేజస్విసూర్య కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. ఇది ఆర్థిక వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య ఏటా లక్షలాది మంది ప్రయాణిస్తారని, మధ్యలో దావణగెరె, హుబ్లీలను అనుసంధానంంతో ఉత్తర కర్ణాటక ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు.
వారంలో రెండు సర్వీసులు


