సాక్షి, బళ్లారి: కేపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం నగరంలోని కనక దుర్గమ్మ ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. 65 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి డీకేశీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో డీకేశీ మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు డీకేశీ సీఎం కావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు తుకారాం, సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, బుడా అధ్యక్షుడు జే.ఎస్ ఆంజనేయులు, మేయర్ గాదెప్ప, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, ఎమ్మెల్యే నాగేంద్ర సోదరుడు, బీ.వెంకటేశ్ ప్రసాద్, కార్పొరేటర్లు కుబేరా, మించు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తిమ్మనగౌడ, బోయపాటి విష్ణువర్దన్, జగన్నాథ్ (జగన్) తదితరులు పాల్గొన్నారు.


