● తుమకూరు టెన్నిస్ టోర్నీ...
తుమకూరు: తుమకూరు వర్సిటీలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన సింగిల్స్ ఫైనల్‌లో, రెండవ సీడ్ జుజానా పావ్లికోవ్స్కా గాయం కారణంగా వైదొలిగింది. దీంతో, జస్టినా మికుల్స్కిటే సులభంగా సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భుజం గాయం కారణంగా శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్ నుంచి పోలెండ్ ఆటగత్తె జుజానా తప్పుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య పోటీ మిస్ కావడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. దీంతో జస్టినా సులభంగా టైటిల్ పొందింది. ఇరువురికీ హోంమంత్రి పరమేశ్వర్ ట్రోఫీలు, బహుమతి నగదును అందజేశారు. కన్నికా పరమేశ్వర్, కలెక్టరు శుభ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
అలరించే హస్తకళా మేళా
బనశంకరి: బెంగళూరు బనశంకరి రెండోస్టేజ్‌లోని శ్రీహరి కళ్యాణ మండపంలో జరుగుతున్న చేనేత హస్తకళా మేళా వినూత్న ఉత్పత్తులకు వేదికై ంది. దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన కాటన్, పట్టు, నూలు చేనేత వస్త్రాలు, చీరలు, మహిళలను అలరిస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తాలు, ఆభరణాలు, గృహాలంకరణ సామగ్రి ఇక్కడ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పేరుపొందిన వస్త్రాలు, చీరలు, కళాకృతుల స్టాల్స్ ఇందులో వెలిశాయి. ఈ ప్రదర్శన ఈ నెల 17వ తేదీ వరకు జరుగుతుంది.


