కన్ను పడితే.. బైక్‌ గల్లంతే | - | Sakshi
Sakshi News home page

కన్ను పడితే.. బైక్‌ గల్లంతే

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

హొసపేటె: కొప్పళ, దావణగెరె తదితర జిల్లాల్లో పదికి పైగా బైక్‌లను దొంగలించిన దొంగ ఎట్టకేలకు పోలీసు వలలో చిక్కాడు. తాను దొంగలించిన బైక్‌పై ప్రయాణిస్తుండగా అతడు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం ద్వారా ఆ దొంగ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన కొప్పళ జిల్లా గంగావతి నగరంలో వెలుగులోకి వచ్చింది. పూర్వాపరాలు.. నగరంలోని ఆనెగుంది రోడ్డులోని శ్రీరాములు కళాశాల సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి గురైన ఆ బైక్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బసాపట్టణ గ్రామానికి చెందిన మల్లప్ప బసప్ప అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఆ బైక్‌ తనదేనని, అది చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్‌కు సంబంధించిన పత్రాలన్నింటిని అతడు పోలీసులకు సమర్పించాడు. బైక్‌ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగావతిలోని సాయినగర్‌కు చెందిన, వృత్తి రీత్యా డ్రైవర్‌ అయిన ప్రకాష్‌ తళవారను పోలీసులు క్షుణ్ణంగా విచారించగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గంగావతి, దావణగెరె, హొసపేటెలతో సహా వివిధ ప్రాంతాల నుంచి తాను మొత్తం పది బైక్‌లను దొంగిలించినట్లు ప్రకాష్‌ విచారణలో అంగీకరించాడు.

గత ఏడాదిన్నర కాలంలో పది బైక్‌ల చోరీ

దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగ

చివరకు రోడ్డు ప్రమాదంతో

పోలీసులకు పట్టుబడిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement