సర్కారు బడికి హైటెక్‌ హంగులు | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి హైటెక్‌ హంగులు

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

మరఖల్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రవేశద్వారంలో విద్యార్థులు

తరగతి గదిలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అత్యాధునిక బెంచీలు

ప్రాజెక్టర్‌తో తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

రాయచూరు రూరల్‌: ప్రైవేట్‌ స్కూల్‌ కంటే తామేం తక్కువ కాదంటూ బీదర్‌ జిల్లాలో ఓ సర్కారు పాఠశాల మౌలిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తోంది. కళ్యాణ కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ తాలూకా మరఖల్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్‌ స్కూళ్లలో లేని సౌకర్యాలను కూడా విద్యార్థులకు కల్పించారు. చిన్న కుగ్రామంలో ఉన్న ఈ పాఠశాల పెద్ద కాన్వెంట్‌లకు దీటుగా నిలిచింది. 2026–27వ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు, ఎస్‌డీఎంసీ, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు. తొమ్మిది గదులు, గ్రంథాలయం, వంట గది, భోజన గదులు, రక్షిత మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

8వ తరగతి వరకు బోధన

ఈ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి మొదలుకొని యూకేజీ తర్వాత 8వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. 185 మంది విద్యార్థులుండగా, 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు పర్మినెంట్‌ అతిథి ఉపాధ్యాయులు, ముగ్గురు వంట మనుషులున్నారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అన్ని విధాలైన పుస్తకాలు, 5 కంప్యూటర్లు, ఎల్‌ఈడీ టీవీ, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు, డిజిటల్‌ తరగతులు, రెండు ప్రాజెక్టులు, రైట్‌ సంస్థ రూ.6.50 లక్షల నిధులను విరాళంగా అందించడంతో పాటు 25 హైటెక్‌ బెంచీలను సమకూర్చింది. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల బెడదను తప్పించవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామనగౌడ అన్నారు.

ప్రైవేట్‌కు దీటుగా మరఖల్‌

ప్రభుత్వ పాఠశాల

మౌలిక సౌకర్యాలతో

ఆదర్శంగా నిలిచిన వైనం

బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌

తాలూకాలో ప్రత్యేకం

Advertisement
 
Advertisement
Advertisement