విచ్చలవిడి మద్యం విక్రయాలు వద్దు | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడి మద్యం విక్రయాలు వద్దు

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో విచ్చలవిడిగా తెరుచుకుంటున్న మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని నమ్మ కర్ణాటక సేన డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు కొండప్ప మాట్లాడారు. జిల్లాలోని గ్రామాలు, నగరాల్లో కళాశాల, ఆలయాలు, మసీదుల సమీపంలో మద్యం విక్రయాల దుకాణాలకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

సేంద్రియ చెత్త కుప్పలు దగ్ధం

హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని హరలు గ్రామంలోని హగరిహళ్ల సమీపంలో ఐదుకు పైగా చెత్త కుప్పలు బూడిదయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలకు ఉపయోగపడే సేంద్రియ ఎరువు ఇప్పుడు బూడిదగా మారింది. వెంటనే స్పందించిన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. లేకుంటే పెను విపత్తు సంభవించి ఉండేది. సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు నిప్పంటుకున్న పరిస్థితి తలెత్తగా విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే మేల్కొని సమస్యను పరిష్కరించారు.

బీఈఓగా నియామకం

హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా బ్యాటి ఉమాపతి నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో ఆయన నూతన బీఈఓగా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement