దొడ్డబళ్లాపురం: వేధింపులు, అత్యాచారం కేసులు పెడతానని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న కిలాడీ లేడీని బెళగావి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలోని లక్ష్మినగర్‌లో నివసిస్తున్న రేష్మ శంకర్ ముతగా.. అధికారులు, ప్రముఖులు, పోలీసులను వలలో వేసుకుని దండుకునేదని తెలిపారు. మ్యాట్రిమోనిలలో అందమైన అమ్మాయిల ఫోటోలు అప్‌లోడ్ చేసి వల వేసేది. సంప్రదిస్తే.. ఫలానా చోటుకు రావాలని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ బెదిరిస్తానని భయపెట్టి డబ్బులు వసూలు చేసేది. ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రేష్మని అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. 2012లో పక్కింటి వ్యక్తి పెళ్లి పేరిట మోసం చేశాడని కుడచి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో ఘటప్రభలో నాగరాజు అనే కానిస్టేబుల్‌పై, 2023లో గజేంద్రఘడలో ఆకాశ్ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. 2025లో సురేశ్ అనే వ్యక్తిపై, ధార్వాడలో ఓ సీఐ మీద రేప్ కేసు పెట్టింది. ఇంకా పలువురిపై ఇలాంటి నకిలీ ఫిర్యాదులు చేసిందని బెళగావి జిల్లా ఎస్పీ కే.రామరాజన్ తెలిపారు.
రేష్మ
శంకర్
బెళగావిలో కిలేడీ అరెస్టు


