చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

రాయచూరు రూరల్‌: నగరంలో ఎవరూ లేని ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.1.26 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నేతాజి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శాంతవీర మాట్లాడారు. ఇంట్లో దొంగతనం జరిగిందని కొత్తపేట షేక్‌ రహీం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. రహీం (19)ను అరెస్ట్‌ చేసి బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బసవరాజ్‌, శారద, పోలీసులు పాల్గొన్నారు.

ఇద్దరు దొంగలు అరెస్ట్‌

హుబ్లీ: చైన్‌ దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ధార్వాడ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హుబ్లీకి చెందిన అసిఫ్‌, అలాగే అమ్మినబావి నివాసి శివానంద హుళ్లగేరి అరెస్ట్‌ అయిన నిందితులు. వీరు ఇద్దరు కలసి టౌన్‌, సబర్బన్‌ స్టేషన్‌ పరిధిలోని వివిధ ఇళ్లలో చోరీలు చేశారు. బంగారు ఆభరణాలు దొంగిలించారు. పోలీసులు నిఘా వేసి ఇద్దరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రూ.1.26 లక్షల విలువైన

నగలు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement