యశవంతపుర: రేవు నగరి మంగళూరులో గంజాయి భూతం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. దీనికి బానిస కావడంతోపాటు అమ్ముకుని డబ్బు సంపాదించవచ్చని కటకటాల పాలవుతున్నారు. బీసీఏ విద్యార్థినిని మంగళూరు నగర పోలీసులు అరెస్ట్ చేసి రూ.35 లక్షలు విలువగల 1.42 కేజీల హైడ్రో గంజాయిని పట్టుకున్నారు. శివమొగ్గ జిల్లా సాగరకు చెందిన విద్యార్థిని సుహన (21) కుందాపురలో కాలేజీలో చివరి ఏడాది బీసీఏ చదువుతోంది. ఈ నెల 12న హైడ్రో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసి పణంబూరు పోలీసులు అరెస్టు చేశారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
యశవంతపుర: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సతీశ్ (53) గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 112 అత్యవసర సేవల వాహనంలో విధుల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. తక్షణం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక చనిపోయారు. శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన సతీశ్ 17 ఏళ్ల పాటు ఆర్మీలో పని చేశారు. తరువాత కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.


