అమెరికా-ఇజ్రాయిల్‌ల మధ్య భిన్న స్వరం | Iran israel And US war live update On 9th March 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

అమెరికా-ఇజ్రాయిల్‌ల మధ్య భిన్న స్వరం

యుద్ధం వేళ మరిన్ని వివరాలు తెలిపిన ఇజ్రాయెల్‌

  • 146వ డివిజన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 300వ బ్రిగేడ్ దళాలు
  • దక్షిణ లెబనాన్‌లో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా కార్యకలాపాలు 
  • క్రైస్తవులు ఉండే ఒక స్థలంలోకి ప్రవేశించిన సాయుధ హెజ్బుల‍్లా ఉగ్రవాదులు
  • హెజ్బుల‍్లా ఉగ్రవాదులను హతమార్చిన ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ 
  • ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధవిమానాన్ని దారి మళ్లించి మరీ దాడి 
2026-03-09 21:13:03

ఇరాన్‌లో టెన్షన్‌ వాతావరణం

  • ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు

  • ఇరాన్‌లో టెన్షన్‌ వాతావరణం  

  • కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీకి మద్దతుగా సభలు 

  • ఈ సభలకు దేశవ్యాప్తంగా ప్రజలు హాజరుకావాలని ప్రభుత్వం తరుఫున ఇరానీయన్లకు  మెసేజ్‌లు  

  • ఇరాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజాసభలు 

  • ఇరాన్‌ ఎన్కెలాబ్‌ స్క్వేర్‌లో భారీ సభ 

  • చర్చాంశనీయంగా మారిన మొజ్తాబా ఖమేనీ హాజరు

2026-03-09 14:56:16

తప్పుడు ప్రచారాలు.. గల్ఫ్‌లో వందల మంది అరెస్టు

  • ఖతార్‌లో 313 మంది అరెస్ట్ 
  • యుద్ధం నేపథ్యంలో వదంతులు ప్రచారం చేస్తున్న వ్యక్తులు
  • ఇరాన్‌ దాడుల వీడియోలు తీసి ప్రచారం
  • బహ్రెయిన్‌లో నలుగురి అరెస్ట్
  • వదంతులు ప్రచారం చేస్తే అరెస్ట్‌ చేస్తామని సౌదీ వార్నింగ్
  • హెచ్చరికలు జారీ చేసిన సౌదీ అరేబియా
2026-03-09 14:53:46

ద్రోహం చేస్తే చర్యలు తప్పవు: ఇరాన్‌

  • విదేశాల్లో ఉంటున్న ఇరాన్‌ దేశస్థులకు వార్నింగ్‌
  • విదేశాల్లో స్వదేశానికిద్రోహం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి
2026-03-09 14:45:41

యుద్ధంపై చైనా కీలక ప్రకటన

  • ఒక దేశ అంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు 
  • సౌర్వభౌమాధికారం, భద్రత, సమగ్రతను గౌరవించాలి 
  • ఇరాన్‌పై దాడి నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రి ప్రకటన
2026-03-09 14:09:59

పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం

  • పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం
  • అమెరికా-ఇజ్రాయెల్‌తో పాటు  వెనక్కి తగ్గని ఇరాన్‌
  • భీకర దాడులతో  ప్రజల్లో మరింత ఆందోళన
  • ఏ క్షణంలో ఏమౌతుందోననే భయం
  • మరొకవైపు ఇప్పటివరకూ 1255మంది చనిపోయినట్లు ఇరాన్‌ ప్రకటన
2026-03-09 14:01:16

యుద్ధంపై భారత్ ఆందోళన.. జైశంకర్

  • పశ్చిమాసియా యుద్ధంపై భారత్ ఆందోళన 
  • చర్చలు, దౌత్యమార్గాలతోనే యుద్ధానికి పరిష్కారం
  • భారత్ ఎప్పుడూ శాంతిపక్షానే నిలబడుతుంది
  • టెహ్రాన్‌లోని దౌత్య కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
  • గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారికోసం చర్యలు
  • ఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత 
     
2026-03-09 13:56:37

బహ్రెయన్‌లో సైరన్‌ల మోతలు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైరన్ 
  • సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచన 
  • ఇరాన్ దాడుల నేపథ్యంలో సైరన్ 
  • ఆయిల్‌ రిఫైనరీలపై దాడి చేస్తున్న ఇరాన్
2026-03-09 13:13:29

టెహ్రాన్ ఉహించని నష్టాన్ని చూస్తోంది.. సౌదీ

  • సౌదీపై దాడులు కొనసాగితే టెహ్రాన్‌ నష్టాన్ని ఎదుర్కొంటుంది
  • టెహ్రాన్ అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొంటుందని ప్రకటించిన సౌదీ అరేబియా
  • షైబా చమురు కేంద్రంపై డ్రోన్ అటాక్ చేసిన ఇరాన్ 
  • అటాక్ అనంతరం వార్నింగ్ ఇచ్చిన సౌదీ అరేబియా
  • ఈ దాడులను రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయి
  • ప్రస్తుతం సంబంధాలు దెబ్బతిన్నాయి
  • భవిష్యత్తులోనూ ఇలానే ఉంటాయని హెచ్చరించిన సౌదీ 
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సౌదీ విదేశాంగమంత్రి
2026-03-09 13:08:18

గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని పార్లమెంటులో ఆందోళన

  • గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల ఆందోళన 
  • వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టిన విపక్షాలు
  • యుద్ధంపై చర్చించాలని డిమాండ్ 
2026-03-09 12:45:15

భారత్‌కు కృతజ్ఞతలు ఇరాన్

  • ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
  • అబ్బాస్ అరాఘ్చీ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు
  • వారి నౌకలను కొచ్చి నౌకాశ్రయంలో నిలపడానికి అనుమతి
  • భారత్‌ మానవతా హృదయానికి ధన్యవాదాలని తెలిపారు.
     
2026-03-09 12:35:21

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

  • యుద్ధాన్ని ఆపేది నెతన్యాహుతో చర్చించాలి
  • నెతన్యాహుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
2026-03-09 11:28:23

యుద్ధ పరిస్థితులపై జైశంకర్ ప్రకటన

  • ఉద్రిక్తతతు తగ్గిచేందుకు చర్చలు జరుపుతున్నాం
  • మార్చి ఒకటిన సీసీఎస్ సమావేశం నిర్వహించాం
  • యుద్ధ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం 
  • కోటి మంది భారతీయులు గల్ఫ్‌లో ఉన్నారు
  • ఇరాన్‌కు వెళ్లొద్దని జనవరిలోనే చెప్పాం
  • ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఎంబసీ చర్యలు తీసుకుంటుంది.
  • సంబంధిత శాఖలను చర్యలను తీసుకోవాలని కోరాం 
  • పెట్రోల్ గ్యాస్ ధరలపై దృష్టి సారించాం
     

     
2026-03-09 11:21:00

కెనడా ప్రధానితో ట్రంప్ చర్చలు

  • కెనడా ప్రధాన మంత్రితో ట్రంప్ భేటీ
  • మార్క్‌ కాన్రీతో భేటీ అయిన ట్రంప్
  • ఇరు దేశాల మధ్య ఆర్థిక అంశాలపై చర్చ
  • యుద్ధ ఉద్రిక్తల నడుమ చర్చలు జరిపిన ట్రంప్
2026-03-09 11:14:38

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై దాడి

  • బహ్రెయిన్ ఆయిల్‌ రిఫైనరీపై మరోసారి దాడి 
  • బాప్కో ఆయిల్‌ రిఫైనరీపై దాడి 
  • రిఫైనరీ వద్ద దట్టంగా కమ్ముకున్న పొగ
  • దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన యుఏఈ
2026-03-09 11:10:16

రికార్డు స్థాయిలో పెరిగిన చమురు ధరలు

  • యుద్ధం కారణంగా రికార్డు స్థాయిలో పెరిగిన చమురు ధరలు
  • ఒకే రోజు 27 శాతం పెరిగిన ముడిచమురు ధర
  • నాలుగేళ్లలో తొలిసారి 115 డాలర్లకు  క్రూడాయిల్‌ ధర
     
2026-03-09 10:58:51

ఇరాన్‌ చమురు నిల్వలపై దాడులు ఆపండి: అమెరికా

  • ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని దెబ్బకొట్టిన అమెరికా-ఇజ్రాయెల్‌
  • చమురు క్షేత్రాల దగ్గర చీలిపోయిన అమెరికా-ఇజ్రాయెల్‌
  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు
  • ఇరాన్‌ చమురు కేంద్రాలకు తాకొద్దని ట్రంప్‌ హుకుం
  • ఇరాన్‌ సైన్యాన్ని దెబ్బకొట్టాలి.. ప్రపంచ మార్కెట్‌ను కాదు
  • చమురు కేంద్రాలపై దాడులు చేయకండి
     
2026-03-09 10:52:45

అమెరికా-ఇజ్రాయిల్‌ల మధ్య భిన్న స్వరం

ఇప్పటివరకూ ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేస్తూ వస్తున్న  అమెరికా- ఇజ్రాయెల్‌లు ఓ విషయంలో మాత్రం రెండుగా చీలిపోయాయి. చమురు నిల్వల అంశంలో అమెరికా-ఇజ్రాయెల్‌ వైఖరి భి న్నంగా ఉంది. ఇరాన్‌ చమురు నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం చేసిన నేప థ‍్యంలో ట్రంప్‌ హుకుం జారీ చేశారు. ఆ చమురు ని  ల్వలపై దాడి చేయొద్దంటూ ఇజ్రాయిల్‌ను ఆదేశించారు. దీంతో అమెరికా- ఇజ్రాయెల్‌ మధ్య కాస్త ఏరుపాటు  వచ్చినట్లు కనిపిస్తోంది.  ఈ విషయంలో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతాన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఒక్కసారిగా ట్రంప్‌ ఆదేశాలకు నెతాన్యాహూ అలిగారట.

 

 

2026-03-09 10:50:41
Advertisement
 
Advertisement
Advertisement