ఇరాన్‌ దాడులు.. దుబాయిలో హైఅలర్ట్ బంకర్లలోకి ప్రజలు? | Iran And Israel, US War March 6th Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ దాడులు.. దుబాయిలో హైఅలర్ట్ బంకర్లలోకి ప్రజలు?

కువైట్‌పై ఆగని దాడులు

  • కువైట్‌లోని  అమెరికా ఎయిర్‌ బేస్‌లపై ఇరాన్ దాడి 
  • మిస్సైల్స్‌తో ఎయిర్‌బేస్‌లపై దాడి 
  • దాడి వివరాలు ప్రకటించిన కువైట్ 
2026-03-06 20:23:49

యుద్ధంపై.. ట్రంప్ సంచలన ప్రకటన

  • ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలి 
  • అప్పుడు చర్చల గురించి ఆలోచిస్తామన్న ట్రంప్
  • ఇరాన్‌కు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదు: ట్రంప్ 
2026-03-06 19:42:57

ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

  • కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం కోసం ముందుకు వస్తున్నాయి
  • అయితే యుద్ధం ప్రారంభించిన వారే చర్చల ప్రతిపాదన జరపాలి 
  • చర్చల ప్రతిపాదన వారే జరపాలని ప్రతిపాదించిన ఇరాన్ అధ్యక్షుడు
2026-03-06 19:40:57

దుబాయిలో హైఅలర్డ్ జారీ

  • క్షిపణి దాడులు జరగవచ్చని ప్రమాద హెచ్చరికలు 
  • ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 
  • జనం బంకర్లలో తలదాచుకోవాలని సూచన 
     
2026-03-06 19:35:26

యుఏఈపై విరుచుకుపడుతున్న ఇరాన్

  • 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణిలతో దాడి
  • దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు ప్రకటన 
  • వివరాలు ప్రకటించిన యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
2026-03-06 19:10:07

రష్యాపై అమెరికా కీలక ఆరోపణలు

  • యుద్ధంలో రష్యా, ఇరాన్‌కు సహకరిస్తుంది
  • మా స్థావరాల  సమాచారం ఇరాన్‌కు చెబుతుంది
  • రష్యా సమాచారంతోనే ఇరాన్ దాడులు చేస్తోంది
2026-03-06 17:58:27

ఖమేనీ బంకర్ ధ్వంసం

  • ఖమేనీ కోసం చేసిన బంకర్‌ ధ్వంసం
  • ధ్వంసం చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
  • ఖమేనీ మృతితో అందులో ఇతర అధికారుల కార్యకలాపాలు
  • దాడి  చేసిన వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
2026-03-06 17:54:15

యుద్ధ భయం.. ఒక్కరోజులు 30 వేల మంది ఖాళీ

  • ఒక్కరోజులో దుబాయిని వీడిన 30 వేల మంది
  • గురువారం 30 వేల మంది దుబాయి వీడినట్లు ప్రకటన
  • ప్రయాణికుల వివరాలు ప్రకటించిన దుబాయి ఎమిరేట్స్ 
2026-03-06 17:32:01

ఖమేనీపై దాడి.. వీడియో రిలీజ్

  • ఖమేనీపై దాడి వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
  • 50కి పైగా ఫైటర్‌ జెట్స్‌తో ఖమేనీ బంకర్‌పై దాడి
  • యుద్ధ విమానాల దాడులతో భారీగా పేలుళ్లు
  • తాజాగా దాడి వీడియో షేర్ చేసిన ఇజ్రాయెల్ 
2026-03-06 17:29:18

ఖమేనీని చంపిన మిస్సైల్ ఇదే

  • ఖమేనిని చంపడానికి ప్రత్యేక మిస్సైల్ వాడిన ఇజ్రాయెల్ 
  • అత్యాధునిక బ్లూస్పారో మిస్సైల్ వాడిన‍ట్లు ప్రకటన 
  • దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించే సత్తా ఉన్న మిస్సైల్ 
  • అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన మిస్సైల్ 
     
2026-03-06 17:13:25

అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి

  • టెలీఅవీవ్‌లోని ఎంబసీపై దాడి 
  • మిస్సైళ్లతో వరుసగా దాడి చేసిన ఇరాన్ 
  • పలు భవనాలు ధ్వంసం 
2026-03-06 17:08:09


యుద్ధ భయం.. ఇండోనేసియా కీలక ఆదేశాలు
యుద్ధం నేపథ్యంలో ఇండోనేసియా వాసుల తరలింపు 
ఇరాన్‌లోని ఇండోనేసియా ప్రజల తరలింపుకు ఏర్పాట్లు 
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఇండోనేసియా ప్రభుత్వం 
యుద్ధం తగ్గే అవకాశాలు లేకపోవడంతో ప్రజలకు ఆదేశాలు
ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న 329 ఇండోనేసియా వాసులు 
అందులో చాలామంది వరకూ విద్యార్థులున్నట్లు ప్రకటన

2026-03-06 17:08:09

యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్‌లో నిత్యావసరాల కొరత

  • ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయిలో పండ్ల కొరత
  • పండ్లతో పాటు కూరగాయల కొరత ఉన్నట్లు బోర్డులు
  • కస్టమర్లకు 2,3 కిలోలు మాత్రమే ఇస్తున్న సూపర్ మార్కెట్లు
  • రంజాన్ మాసం కావడంతో పండ్లు తప్పనిసరి 
  • పండ్ల కొరత ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుబాయి వాసులు 
2026-03-06 17:01:32

ఆయిల్‌ ఇండస్ట్రీలో భారీగా మంటలు

  • పుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీలో భారీగా మంటలు
  • యుఏఈలోని పుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీపై ఇరాన్‌ దాడి
  • మిసైల్స్ అటాక్‌తో ఆయిల్‌ ఇండస్ట్రీలో భారీగా మంటలు
  • తాజాగా షాటిలైట్ చిత్రాలు విడుదల
2026-03-06 16:56:07

ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది సాద్‌-అల్‌-ఖాబి
  • చమురు బ్యారెల్‌ ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉంది.
  • ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.
     
2026-03-06 16:18:46

అమెరికా ఇరాన్ యుద్ధం.. గంటల్లోనే వేల ఖర్చు

  • తొలివంద గంటల్లో రూ. 30,710 కోట్ల వ్యయం 
  • రోజుకు రూ. 7,395 కోట్ల ఖర్చు
  • లెక్కలు వెల్లడించిన సీఎస్‌ఐఎస్ ధింక్ ట్యాంక్‌
2026-03-06 15:44:59

మా నెక్స్ట్ టార్గెట్ ఆ దేశమే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • మా నెక్స్ట్ టార్గెట్‌ క్యూబానే
  • ఫస్ట్ ఇరాన్, తర్వాత క్యూబా అంటూ ట్రంప్ ప్రకటన 
  • అమెరికాలో ఉన్న క్యూబా శరణార్థులతో మాట్లాడిన ట్రంప్ 
  • త్వరలోనే శరణార్థులను స్వదేశానికి వెళ్లేలా చేస్తానని ప్రకటన 
2026-03-06 14:24:08

హర్మూజ్‌ జలసంధితో టెన్షన్‌?

  • పూర్తిగా మూతపడే పరిస్థితికి హార్మూజ్‌ జలసంధి
  • జాయింట్‌ మారిటైమ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ వెల్లడి
  • డ్రోన్లు, క్షిపణి దాడులు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ఫియరెన్సెస్‌తో వాణిజ్య నౌకలకు తీవ్ర ఇబ్బందులు

 

 

2026-03-06 13:23:47

కొనసాగుతున్న విమానాల రద్దు

  • మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల కొనసాగుతున్న విమానాల రద్దు
  • శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దు
  • గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయం రావాల్సిన 12 విమానాలు రద్దు
  • ఖతార్, యూఏఈ, కువైట్ నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు
  • బహ్రెయిన్, సౌదీఅరేబియా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు
2026-03-06 13:23:47

ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌..

  • అబుదాబీ నుంచి భారత్‌కు ప్రారంభం కానున్న ఇతిహాద్‌ విమాన సర్వీసులు.
  • అబుదాబీ నుంచి భారత్‌లోని ఎనిమిది ప్రాంతాలకు సర్వీసుల ప్రయాణం.
  • అహ్మాదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌, కొచ్చి, కోజీకోడ్‌, ముంబై, కోల్‌కత్తాకు విమాన సర్వీసులు రానున్నాయి.
  • మార్చి 19వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
2026-03-06 11:30:02

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు..

  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు.
  • టెహ్రాన్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఉన్న జోమ్‌హురీ అవెన్యూపై ఇజ్రాయెల్‌ దాడులు.
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో భవనాలు ధ్వంసం.
  • మరోవైపు.. నేడు ఇరాన్‌ లీడర్స్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది.
2026-03-06 11:30:02

ఇరాన్‌కు అమెరికా ఝలక్‌..

  • ఇరాన్‌ డ్రోన్‌ క్యారియర్‌ షిప్‌ను ధ్వంసం చేసిన అమెరికా
  • అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వీడియో విడుదల
  • చిన్న విమాన వాహక నౌక సైజులో డ్రోన్‌ క్యారియర్‌
2026-03-06 10:30:16

మధ్యప్రాచ్యం అతలాకుతలం

  • వారం రోజులుగా యుద్ధంతో మధ్యప్రాచ్యం అతలాకుతలం
  • క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా
  • 100 గంటల్లో ఇరాన్‌లోని 750కిపైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్-అమెరికా బాంబుల వర్షం
  • ఇరాన్‌లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్-అమెరికా దాడులు
  • టెహ్రాన్‌ సహా ఇతర నగరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్-అమెరికా సైన్యాలు
  • హెజ్‌బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులకు దిగే అవకాశం
2026-03-06 09:17:16

ఇరాన్‌ దూకుడు..

  • ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలపై ప్రతిదాడులు విస్తరిస్తున్న ఇరాన్‌
  • గల్ఫ్‌ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్న ఇరాన్‌
  • అజర్‌బైజాన్‌లోని నక్షివాన్‌ విమానాశ్రయంపై డ్రోన్లతో ఇరాన్‌ దాడి
  • ఒమన్‌లోని పోర్టుపైనా ఇరాన్‌ డ్రోన్లతో దాడులు
  • అమెరికా స్థావరాలపైనా కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు
  • హిందూ మహాసముద్రంలో నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్‌. 
2026-03-06 09:17:16

భారత్‌కు గుడ్‌న్యూస్‌..

  • రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు
  • ఇరాన్‌ యుద్ధం దృష్ట్యా 30 రోజులు మినహాయింపు ఇచ్చిన అమెరికా
  • మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ వెల్లడి
  • ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరగాలన్నారు. 
  • దీంతో రష్యాకు ఆర్థిక పరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు.
  • ఇదే సమయంలో అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్‌ వ్యాఖ్యానించారు.
  • భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
     

 

2026-03-06 08:43:25

ఇరాన్ యుద్ధనౌకలపై అమెరికా దాడులు

  • ఇరాన్ యుద్ధనౌకల లక్ష్యంగా కొనసాగుతున్న అమెరికా దాడులు
  • ఇరాన్ డ్రోన్ క్యారియర్‌పై అమెరికా దాడి చేయడంతో మంటలు
  • అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన యూఎస్‌ సెంట్రల్ కమాండ్
2026-03-06 08:43:25

బహ్రెయిన్‌పై ఇరాన్‌ భీకర దాడులు

  • బహ్రెయిన్‌పై విరుచుకుపడిన ఇరాన్‌.
  • బహ్రెయిన్‌ ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ దాడి.
  • క్షిపణులు, 123 డ్రోన్లతో ఇరాన్‌ భారీ దాడి.
  • మంటల్లో బహ్రెయిన్‌ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ. 
2026-03-06 07:48:34

ఇరాన్‌కు మరోసారి ట్రంప్ గట్టి హెచ్చరిక

  • ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక
  • ఇరాన్‌లోని సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్‌ ఆయుధాలు వీడాలన్న ట్రంప్‌
  • ఇరాన్‌ను తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన తరుణమన్న ట్రంప్
  • తన మాట వినకుంటే యుద్ధం చేయక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్‌
  • యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ మిగలదన్న ట్రంప్‌
2026-03-06 07:28:17

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

  • ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ ఎన్నిక ప్రక్రియలో తనను భాగస్వామిని చేయాలన్న ట్రంప్‌
  • సుప్రీం లీడర్‌ పదవికి ఖమేనీ కుమారుడు మొజ్తబా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు.
  • ఇరాన్‌ సమయం వృథా చేస్తున్నారని ట్రంప్‌ విమర్శలు..


 

2026-03-06 07:28:17
Advertisement
 
Advertisement
Advertisement