
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్‌వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఇంగ్లాండ్లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్‌పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్‌ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది.