
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)-టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల దంపతుల కూతురు జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్ వేదికగా గురువారం (07-08-2025) రాత్రి జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.




















