అమ్మాయిలూ.. బహుపరాక్‌! | Woman Urges Digital Checks Before Marriage Goes Viral On Socialmedia | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ.. బహుపరాక్‌!

Jun 18 2025 12:59 PM | Updated on Jun 18 2025 1:58 PM

Woman Urges Digital Checks Before Marriage Goes Viral On Socialmedia

వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్‌ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్‌లైన్‌లో అతనితో చాట్‌ చేశా.  అలా.. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. 

అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్‌ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. 

అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్‌. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్‌ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్‌ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 

ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశారు.  

సోషల్‌ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్‌ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. 

(చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)
 

Advertisement
 
Advertisement
Advertisement