
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.
రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.
విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్‌పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.