ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ | Visakhapatnam Steel Plant Privatization: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ

Feb 10 2026 4:08 AM | Updated on Feb 10 2026 4:08 AM

Visakhapatnam Steel Plant Privatization: Andhra Pradesh

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌  నిర్వహణకు టెండర్లు 

కార్మికుల్లో తీవ్ర ఆందోళన 

ఉక్కునగరం:  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్న చర్యలు ఆగడంలేదు. ఇప్పటికే సింటర్‌ ప్లాంట్, ఎస్‌ఎంఎస్‌–1 వంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన యాజమాన్యం.. తాజాగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (టీపీపీ–1) నిర్వహణను కూడా ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు అడుగులు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. టీపీపీ నిర్వహణ, మెయింటెనెన్స్‌తో పాటు కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం సోమవారం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ టెండర్‌ విలువను రూ.83.52 కోట్లుగా నిర్ణయించారు. ఈనెల 26వ తేదీ సా.3 గంటల వరకు టెండర్లు స్వీకరించి, 27వ తేదీ సా. 3 గంటలకు వాటిని తెరవనున్నట్లు ప్రకటించారు. ఉక్కు ఉత్పత్తికి ప్రాణంలాంటి క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా స్టీల్‌ప్లాంట్‌ భవితవ్యానికే ముప్పు తెచి్చనట్లవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా చేసే ఈ విభాగం ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని, తద్వారా ప్లాంట్‌ను ఆర్థికంగా మరింత బలహీనపరచాలనే ఉద్దేశమే కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి.  

పోరాటం మరింత తీవ్రతరం.. 
ఒకవైపు కార్మికుల తొలగింపులు కొనసాగుతుండగా, మరోవైపు కీలక విభాగాలను దశలవారీగా ప్రైవేటీకరించడం ద్వారా విశాఖ ఉక్కును నిరీ్వర్యం చేసి చివరికి అమ్మకానికి సిద్ధంచేసే వ్యూహం అమలుచేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రూ.11,440 కోట్ల ప్యాకేజీ తెచ్చి స్టీల్‌ప్లాంట్‌ను ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెప్పిన టీడీపీ కూటమి నేతలు.. ఇప్పుడు క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించడంపై ఏం సమాధానం చెబుతారని కార్మిక నేతలు ప్రశి్నస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement