
ఇటీవలే పరమ్ సుందరితో అభిమానులను అలరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. అంతలోనే మరో మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్కు తన పెళ్లి గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి తనకైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని తెలిపింది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించింది. దీంతో తనపై వస్తున్న మ్యారేజ్ రూమర్స్‌కు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ.
అయితే గతంలో ఆమె.. శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే వీరిద్దరు చాలాసార్లు జంటగా కనిపించడంతో రూమర్స్ వినిపించాయి. గత ఇంటర్వ్యూలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్లో బోనీ కపూర్, ఖుషీ కపూర్తో పాటు శిఖర్ పేరును కూడా చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. టాలీవుడ్‌లో రామ్ చరణ్ సరసన పెద్దిలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.