
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.
పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్‌లోని సూపర్‌సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్‌లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు.
ఈ వీడియోను @weddingdreamco ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్‌తో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్‌తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్‌చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.
వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి.