ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్‌ | Newlywed Bride Eloped With Boyfriend Story Details In Tamilnadu, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్‌

Jul 4 2025 9:41 AM | Updated on Jul 4 2025 11:30 AM

Newlywed And Lover Story Details In Tamilnadu

అన్నానగర్‌: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం..పెరంబూర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్‌నగర్‌ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్‌ కోసం బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.

అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్‌ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేశారు. కానీ అది స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్‌ చేసిందని వారికి తెలిసింది.

ఈ క్రమంలో బ్యూటీ సెలూన్‌కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్‌ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి  తిరు.వి.కె.నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement