
కాజీ, ఇద్దరు సాక్ష్యుల అరెస్ట్‌కు కోర్టు ఆదేశం
కరాచీ: పాకిస్తాన్‌లో హిందువులు సహా మైనారిటీ వర్గాలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ 15 ఏళ్ల హిందూ బాలికను తనను ఓ వృద్ధుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని కోర్టుకు పేర్కొంది. తన కుటుంబాన్ని చేరుకునే అవకాశం కల్పించాలని వేడుకుంది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై మిర్పూర్‌ఖాస్ జిల్లాలోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. తుది తీర్పు వెలువడే వరకు ఆమెను సురక్షితంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.
గత నెలలోతన కుమార్తెను తమ నివాసానికి సమీపంలో ఉండగా షార్ వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి నిర్మల్ మెఘ్వార్ పేర్కొంది. ‘అప్పటి నుంచి ఆ వర్గం వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు నా కుమార్తె బర్త్ సర్టిఫికెట్ అందివ్వకుండా అడ్డుకున్నారు. మొదటి వాయిదా విచారణకు వచి్చన సమయంలో కోర్టు వద్దే మాపై దాడి చేశారు. నా కుమార్తె గురువారం ధైర్యంతో కోర్టులో వాంగ్మూలం ఇచి్చంది’అని ఆమె పేర్కొంది. దీంతో, పెళ్లి జరిపించిన కాజీని, ఇద్దరు సాకు‡్ష్యలను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందువులు, క్రైస్తవులు సహా మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం వెయ్యి మంది బాలికలకు ఇలా బలవంతంగా పెళ్లిళ్లవుతున్నాయని అంచనా.