సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్ | Marriage Is Not An Emergency Boss Asked Employee To Work On A Nightmare Project Before Engagement | Sakshi
Sakshi News home page

సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్

Feb 2 2026 1:05 PM | Updated on Feb 2 2026 1:34 PM

Marriage Is Not An Emergency Boss Asked Employee To Work On A Nightmare Project Before Engagement

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వర్క్ కంటే పెళ్లి ముఖ్యం కాదని తమ బాస్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.

నేను పనిచేస్తున్న కంపెనీలో.. నా నిశ్చితార్థం & వివాహం గురించి రెండు నెలల ముందే మేనేజర్లకు సమాచారం ఇచ్చాను. అయితే వాళ్లు దానిని సీరియస్‌గా తీసుకోలేదని.. పైగా పెళ్లి ఎమర్జెన్సీ కాదని చెప్పినట్లు ఉద్యోగి రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఉద్యోగం కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని, అవసరమైతే కొంతకాలం ఉద్యోగం మానేయమని ఒకరు వెల్లడించగా.. చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయని, ఉద్యోగుల అవసరాలను సైతం గుర్తించడం లేదని మరొకరు వెల్లడించారు. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని ఇంకొకరు అన్నారు.

కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా పనికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వెల్లడయ్యాయి. ''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు  మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా'' అంటూ గతంలో లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement