
శ్రీరస్తు... శుభమస్తు
రిలేషన్‌షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్‌లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్‌స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్‌ను నేటితో ముగిస్తున్నాం!
ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు
పెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్
ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
గ్యాప్ పెరిగిపోతోంది
పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్‌లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్‌స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్‌ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతల
పేరెంట్స్‌కూ కౌన్సెలింగ్ అవసరం
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి
అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్‌లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్‌లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్‌కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్‌కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్
పైపై బంధంగానే ఉంటుంది
పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్‌లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్‌ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్‌గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్‌మ్యారీడ్‌గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్
పరిణతే ప్రామాణికం
పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి.
– కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్