
దాంపత్య జీవితం బాగుంటే..జీవితం సాఫిగా హాయిగా సాగిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు అటు కెరీర్ పరంగానూ, ఫ్యామిలీ పరంగా హెల్దీ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. పైగా జీవితాన్ని మంచిగా లీడ్ చెయ్యొచ్చు. అయితే ఈ విషయంలో అందరు ఎక్కువగా పొరపాటులు చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరూ సమానంగా బ్యాలెన్స్ కావాలి. అప్పుడే సంసారం అనే నావా సాపీగా సాగుతుంది. ఇందులో ఎవ్వరో ఒక్కరూ తేడాగా ప్రవర్తించినా.. అంతే పరిస్థితి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ జాన్ అబ్రహం మాత్రం ఈ మూడు నియమాలు పాటిస్తే..దాంపత్య జీవితాన్ని పటిష్టంగా మార్చుకోవచ్చని చెబుతున్నాడు.
జాన్ అబ్రహం వైవిధ్యభరితమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. ఆయన నటుడిగా, నిర్మాతగా ఎంత మంచి మంచి చిత్రాలు చేసినా..వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంగ గోప్యంగా ఉంటుంది. అసలు పబ్లిక్‌గా కనిపించడం కూడా అత్యంత అరుదే. అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్ ప్రియా రంచల్ అనే అమ్మాయిని 2014 యునైటెడ్ స్టేట్స్‌లో వివాహం చేసుకున్నాడు.
అదికూడా ప్రైవేట్‌గా ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా బంధువుల సమక్షంలో చేసుకున్నారు. ఆ విషయం కూడా బయటకు పొక్కనీయలేదు జాన్. ఒక న్యూఈయర్‌కి శుభాకాంక్షలు చెబుతూ ప్రియా జాన్ అని సంతకం చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అదీగాక ఈ జంట పబ్లిక్‌గా కనిపించడం కూడా అరుదే కాబట్టి తెలిసే ఛాన్స్ తక్కువ కూడా. 11 ఏళ్ల వైవాహికబంధంలో ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఆనందంగా లైఫ్‌ని లీడ్ చేస్తోంది ఈ జంట. ఆయన ఇటీవల ఒక సంభాషణలో వివాహ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
వైవాహిక జీవితం స్ట్రాంగ్‌గా ఉండాలంటే మూడు నియమాలు పాటించాలంటూ కొన్ని టిప్స్ షేర్ చేశాడు. నా సినిమాలకు, వ్యక్తిగత జీవితంతో సబంధంలేదు. అందుకే తాను మూవీ షూటింగ్ అయిపోగానే వెళ్లిపోతా..అక్కడ ఎక్కడ తన గురించి, ఫ్యామిలీ గురించి ప్రస్తావించనని అన్నారు. అలాగే నా పేరు గాసిప్స్ హెడ్‌లైన్‌కి వెళ్లేలా ఎలాంటి ప్రచారక్తరను నియమించుకోలేదని చెబుతున్నాడు.
ఎందుకంటే తన షూటింగ్స్ ముగించుకుని నేరుగా తన ఇంటికి వెళ్లిపోతానని అన్నారు. అలాగే తన భార్య కూడా ఈ గోప్యతను పాటిస్తుందని చెప్పాడు. ఎక్కడ తన గురించి ప్రస్తావన చేయదు. అదే మా దాంపత్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి గాఢమైన నమ్మకం..పెట్టుకున్న నియమాన్ని బ్రేక్ చేయకుండా గౌరవించడం అనేవి బంధాన్ని దృఢంగా మారుస్తుందని చెబుతున్నాడు అబ్రహం.
మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ప్రైవసీని కూడా మనం కాపాడాలని, మన కెరీర్ వాళ్ల జీవితాన్ని ఇబ్బందులో పెట్టేలా చేయకూడదనేది తన ఉద్దేశ్యమని అంటున్నాడు. ఇక జాన్ భార్య ప్రియా అత్యంత విజయవంతమైన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, పైగా ఆమె కూడా మీడియాకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుందట. ఏ జంట అయిన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచితే..ఎలాంటి చిక్కుల్లో పడరు. రిలేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుందనేది నటుడు జాన్ చాలా చక్కగా వివరించారు.
(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..)