
చాలామందికి, టీ, కాపీ, కొన్ని రకాల పానీయాలను సేవించడంతో దంతాలు పసుపురంగులోకి మారిపోతుంటాయి. అయితే స్ట్రాబెర్రీలు వంటి వాటితో తెల్లగా మార్చేయొచ్చంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా చాలామంది దీన్ని గట్టిగా నమ్ముతున్నారు కూడా. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు. డెంటిస్ట్‌ని సంప్రదించకుండానే స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లగా మార్చుకోవచ్చనేది నిజం కాదని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ సైన్సు ఏం అంటోందో చూద్దామా..!
స్ట్రాబెర్రీలు దంతాలను తెల్లగా మారుస్తాయని చెప్పే శాస్త్రియ ఆవిష్కరణ లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించినప్పటికీ అది శాశ్వతంగా కాదని చెబుతున్నారు. పరిశోధనల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వాణిజ్య ఉత్పత్తుల కంటే మెరుగ్గా ఈ స్ట్రాబెర్రీలు సహజంగా దంతాల రంగు మార్చేస్తాయనేది వాస్తవం కాదని చెప్పారు.
అధ్యయనంలో స్ట్రాబెర్రీలు దంతాల రంగును మార్చడం చూశాం. అయితే దీనిలో 100% గాఢత కలిగిన స్ట్రాబెర్రీ సారం 2-4 రోజుల్లో దంతాల్లో ప్రభావవంతమైన మార్పు చూపిస్తోంది గానీ..శాశ్వతమైన తెల్లటి రంగుని ఇవ్వదని తెలిపారు. అది గణనీయమైన మార్పులను కూడా ఏమి ఇవ్వదని చెప్పారు. పైగా దీనివల్ల ప్రమాదాలు ఉంటాయని అన్నారు.
ఎందుకు మంచిది కాదంటే..
స్ట్రాబెర్రీలు ఆమ్లంగా ఉంటాయి. ఆమ్లం దంతాలపై ఉన్న రక్షణపొర అయిన ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది
ఎనామిల్ పలుచబటం మొదలైతే మళ్లీ యథావిధిగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు.
ఇందులో ఉండే సహజ చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను తినేస్తాయి. అంతేగాదు కుహారాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ప్రయత్నించాలనుకుంటే..
ఇలా వెంటనే తెల్లగా అవ్వడం కావాలి అనుకుంటే..దంతాలపై స్ట్రాబెర్రీల యాసిడ్, చక్కెరను పూర్తిగా తొలగించాలి.
ఎనామిల్ దెబ్బతినకుండా బ్రష్ చేసేందుకు కనీసం 30 నిమిసాలు వేచి ఉండండి
సురక్షితమైన మార్గాలు..
కాఫీ, టీ, వైన్ వంటి పానీయాలను పరిమితం చేయండి
క్రమం తప్పకుండా బ్రష్ చేయండి.
దంతవైద్యుడు ఆమోదించిన వైటెనింగ్ టూత్‌పేస్ట్ లేదా స్ట్రిప్స్‌ను ఉపయోగించండి
బ్లీచింగ్ లేదా ఇన్-క్లినిక్ వైటెనింగ్ వంటి ప్రొఫెషనల్ చికిత్సలు మేలు
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్‌టాపిక్‌గా ఊబకాయం..)