
ప్రముఖ హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అర్చన కవి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రిక్ వర్గీస్‌ను ఆమె పెళ్లాడింది. ఈ విషయాన్ని ప్రముఖ టీవీ హోస్ట్ ధన్య వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, అభిమానులు అర్చనకు విషెస్ చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. అర్చన కవికి ఇది రెండో వివాహం. ఆమె గతంలో 2016లో హాస్యనటుడు, యూట్యూబర్ అబీష్ మాథ్యూను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేశారు. విడాకులు తీసుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. డివోర్స్ అయిన నాలుగేళ్ల తర్వాత అర్చన మరోసారి పెళ్లి పీటలెక్కింది. అయితే రిక్ వర్గీస్ తనకు ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యాడని గత ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. 2009లో నీలతామర అనే రీమేక్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతంలో పలు సినిమాలు చేసిన అర్చన ఇటీవలే ఐడెంటిటీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టోవినో థామస్, త్రిష కృష్ణన్ కూడా నటించారు. అర్చన అంతకుముందు మమ్మీ అండ్ మీ, బెస్ట్ ఆఫ్ లక్, సాల్ట్ అండ్ పెప్పర్, మజవిల్లినాట్టం వారే, అరవాన్, మోనై అంగనే ఆనాయి, డే నైట్ గేమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కల్లన్ లాంటి మలయాళ సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా ఎంతే ప్రియా గణంగల్, బ్లడీ లవ్, టాక్ విత్ ఆర్చీ, ట్రావెల్, సుందరి నీయుమ్ సుందరన్ జానుమ్ వంటి షోలలో కనిపించింది.