టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్‌మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.
అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్‌గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.


