
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.
బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్‌ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్‌ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్‌చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్‌ను చితకబాదాడు. అదే సమయంలో ..
అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్‌ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్‌తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్‌చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు.
ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్‌చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE
— ABP News (@ABPNews) July 8, 2025