నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ | nepal youth protest pm balen shah resignation demand suicide attempts | Sakshi
Sakshi News home page

నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్

Jul 12 2026 5:43 PM | Updated on Jul 12 2026 6:03 PM

nepal youth protest pm balen shah resignation demand suicide attempts

ఖాట్మండు: నేపాల్‌ మరోసారి అట్టుడుకుతుంది. ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్లతో యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దేశంలో నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగిపోయిందని నిరసనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్‌ పోసుకోని ఆత్మహత్యకు యత్నించగా వారిలో ఇద్దరు మరణించారు.

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం అక్కడి జెన్‌జీ ఉద్యమం.. సెప్టెంబర్ 2025లో నాటి కె.పి. శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం, అవినీతికి పాల్పడటంపై నేపాల్ యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి బాలేంద్ర షా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ నిరసనల వేడి పాత ప్రభుత్వాన్ని కూల్చేయడమే కాకుండా, యువత అంతా ఆయన వెనుక సమీకృతమమయ్యారు. దీంతో బాలేంద్రషా నేతృత్వంలోని నేపాల్ పార్లమెంట్‌లో ఉన్న మొత్తం 275 స్థానాల్లో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏకంగా 182 సీట్లు గెలుచుకుంది. ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.

అయితే ప్రధానిగా బాలేంద్ర ఆరు నెలలైనా కాకముందే నేపాల్‌లో యువత ఆయనపై పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పెద్దఎత్తున యువత రోడ్లెక్కారు. ఆయన రాజీమామా చేయాలని డిమాండ్ చేస్తూ ‍ముగ్గురు యువకులు పెట్రోల్‌ పోసుకోని ఆత్మహత్య యత్నం చేయగా అందులో ఇద్దరు మరణించారు.

దీంతో ప్రధానమంత్రి ప్రజావ్యతిరేకంగా, నిరంకుశంగా పరిపాలిస్తున్నారని జెన్-జి నేపాల్ సంస్థ ఆరోపించింది. యువత ఉపాధి, ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్, విధానాలు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని  యువతలో ఆశ, విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement