ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్‌ | Aqua Farmers Protest In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్‌

Jun 30 2026 12:30 PM | Updated on Jun 30 2026 12:53 PM

Aqua Farmers Protest In Andhra Pradesh

సాక్షి, ఏలూరు జిల్లా: ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్‌ కొనసాగుతోంది. ఆక్వా కార్యకలాపాలను రైతులు నిలిపివేశారు. ఆక్వా ఫీడ్‌ డీలర్లు, షాపుల యాజమానులు రైతులకు మద్దతు ఇచ్చారు. రైతులతో పాటు బంద్‌లో ఆక్వా డీలర్లు పాల్గొన్నారు. ఆ‍క్వా ఫీడ్‌ ధరలు భారీగా పెంచడంపై రైతులు నిరసనలు. ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురంలో ఆక్వాఫీడ్‌ షాపులను మూసివేశారు.

కూటమి సర్కార్‌.. ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోకపోవడ, ఆక్వా సిండికెట్ ఫీడ్ ధరలు భారీగా పెంచడంపై నిరసిస్తూ ఏపీ ఆక్వా రైతు సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది.  టన్ను మేతకు అదనంగా రూ.10 వేల నుండి రూ.12 వేలు పెంచడంపై ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయాలంటూ రైతుల డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement