అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్‌ రిపీట్‌.. అచ్చం నాన్నలాగే.. | Akhil-Zainab: Photo mirrored his parents Nagarjuna Amala in this wedding | Sakshi
Sakshi News home page

Akhil-Zainab: నాగార్జున- అమల పెళ్లి ఫోటో వైరల్‌.. అమ్మానాన్నలాగే అఖిల్‌ కూడా..

Jun 9 2025 4:08 PM | Updated on Jun 9 2025 5:02 PM

Akhil-Zainab: Photo mirrored his parents Nagarjuna Amala in this wedding

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.

తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్‌ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్‌ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్‌ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్‍తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement