నాలుగేళ్ల తర్వాత తండ్రైన సింగర్.. ఆలస్యంగా రివీల్! | Akhil Sachdeva Becomes Father: Bollywood Singer Shares Happy News After 4 Years of Marriage | Sakshi
Sakshi News home page

Akhil Sachdeva: నాలుగేళ్ల తర్వాత తండ్రైన సింగర్.. ఆలస్యంగా రివీల్!

Nov 17 2025 4:42 PM | Updated on Nov 17 2025 4:51 PM

Akhil Sachdeva Wife Tanya Welcome Baby Girl After 4 Years Of Marriage

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అఖిల్ సచ్‌దేవా తండ్రిగా ప్రమోషన్ పొందారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా రివీల్ చేశారు. ఈ నెల ఆరో తేదీన తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా కూతురి రూపంలో మా అమ్మ తిరిగొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.

కాగా.. సింగర్ అఖిల్ సచ్‌దేవా.. బాలీవుడ్‌లో సన్ మేరే హమ్‌ సఫర్, తేరా బన్ జౌంగా, చన్నా వే వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకున్నారు.
వీరిద్దరు డిసెంబర్ 7 2020న జైపూర్‌లోని సమోదే హవేలీలో తాన్యా గుల్లా, అఖిల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదారేళ్ల పాటు డేటింగ్‌ ఉన్న ఈ జంట పెళ్లి జీవితం ప్రారంభించారు. ఆరేళ్ల క్రిత నా కచేరీకి వచ్చిన తాన్య మొదటి చూపులోనే నచ్చేయడంతో అలా మా పరిచయం మొదలైందని గతంలో సింగర్ వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement