
ప్రముఖ అథ్లెట్ , రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, వి. శ్రీనివాసన్ ల కుమారుడు డాక్టర్ విఘ్నేష్ ఉజ్వల్ పెళ్లి పీటలెక్కాడు. సోమవారం లే మెరిడియన్ హోటల్‌లో జరిగిన విలాసవంతమైన వేడుకలో అశోక్ కుమార్ -షిని కుమార్తె కృష్ణను సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, నటుడు శ్రీనివాసన్, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ , ఎంపి జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.
“ఈ వివాహం తన కొడుకు జీవితంలో తదుపరి దశ. తల్లిగా తన జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తనకు నచ్చిన, మెచ్చిన అమ్మాయిని తన భాగస్వామిగా చేసుకున్నాడని పీటీ ఉష వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్పోర్ట్స్ మెడిసిన్‌లో డిప్లొమా సంపాదించారు. ప్రస్తుతం అతను పి.టి. ఉష కేరళలో స్థాపించిన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

అందంగా మెరిసిన వధూవరులు
విశాలమైన బంగారు జరీ అంచు, క్లిష్టమైన మోటిఫ్‌లతో నేసిన కంజివర్మ చీరలో నవ వధువు అందంగా కనిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె ముగ్ధమనోహరంగా కనిపించింది. ముఖ్యంగా, చక్కటి నక్షి డిజైన్‌తో రూపొందించిన చోకర్‌తో , పొడవాటి లేయర్డ్ నెక్లెస్‌తో జత చేసింది. ఇంకా అందమైన టెంపుల్ మాంగ్-టీకాతో పాటు మ్యాచింగ్ చెవిపోగులు, కమర్బంధ్, వంకీ , ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్ ,గ జ్రాతో అలంకరించిన జడ ఆమెకు అందంగా అమరాయి. మరోవైపు, వరుడు విఘ్నేష్ లేత గోధుమరంగు టోన్ గల కుర్తా, ధోతీ మరియు కండువాలో అందంగా కనిపించాడు.
పి.టి. ఉష కొడుకు పెళ్లిలో మేరీ కోమ్ స్పెషల్
బాక్సింగ్ రింగులో పంచులతో విరుచుకుపడి ప్రత్యర్థులను మట్టి కరిపించి, బంగారు పతకాలతో మురిపించిన మేరీ కోమ్ ఈ పెళ్లిలో ట్రెడిషనల్‌లుక్‌లో ఆకట్టుకున్నారు. గోల్డెన్ సిల్క్ చీర, ఆభరణాలు, తలలో మల్లెలతో కేరళ స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు, కల్యాణానికి వచ్చినఅందరి ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిస్తూ కనిపించారు .తాను కేరళ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాననీ వడ, ఇడ్లీ, సాంపార్ అన్నీ బెస్ట్‌అని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు.. కేరళలో అందరూ చోట్ ఇష్టపడతారు, ఐ లైక్ చావల్, ఐ ఆమ్ ఏ రైస్ ఈటర్ అని చెప్పారు. మరి ఫిట్ నెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినపుడు.. మితంగా తింటూ పరవాలేదు అని సమాధానమిచ్చారు.