

అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. జూన్ 6న తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని అతను పెళ్లాడాడు.

పెళ్లి వేడుక తర్వాత జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ రిసెప్షన్ వేడుక జరగ్గా.. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ అక్కినేని పెళ్లి ఫోటోలను మాత్రం వెంటనే షేర్ చేయలేదు.

పెళ్ళైన మూడు వారాల తర్వాత తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

‘నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్. దీంతో అఖిల్ పెళ్లి ఫోటోలు మరోసారి నెట్టింట వైరల్ అయ్యాయి.









