 
													ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
