
వనపర్తి జిల్లా: కల్లు ఇవ్వలేదని వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. మండలంలోని రేమద్దులకు చెందిన భవానీ(26)కి మేనమామ అయిన మండ్ల రాములుతో 9ఏళ్ల కిందట వివాహమైంది. భవానీకి తరచుగా కల్లు తాగే అలవాటు ఉంది. అదేక్రమంలో ఆదివారం కల్లు తీసుకురావాలని భర్తకు చెప్పగా సాయంకాలం తీసుకొస్తానని చెప్పి భర్త కూలీ పనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. కల్లు తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కూలీ పనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్న భార్య శవాన్ని కిందకు దించాడు. భవానీకి రోజూ కల్లుతాగే అలవాటు ఉండటం, కల్లు తాగకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేదని, భర్త కల్లు తెచ్చి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది క్షణికావేశంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.