పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. గ్రాండ్‌గా వెడ్డింగ్ | Balika Vadhu actress Avika Gor and Milind Chandwani are officially married | Sakshi
Sakshi News home page

Avika Gor: గ్రాండ్‌గా చిన్నారి పెళ్లి కూతురి వివాహ వెేడుక.. వీడియో వైరల్

Sep 30 2025 6:30 PM | Updated on Sep 30 2025 8:02 PM

Balika Vadhu actress Avika Gor and Milind Chandwani are officially married

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం ముద్దుగుమ్మ సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

కాగా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష‍్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ లాంటి తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది. 

అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్‌ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగించారు. తాజాగా ఇవాళ వివాహ బంధంలోకి ‍అడుగుపెట్టారు. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement