
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్‌లతో సందడి చేశారు.
పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.
కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం.
Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6
— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025