
బాలీవుడ్, హాలీవుడ్ రంగం ఏదైనాలబ్రిటీల పెళ్లిళ్లు, వయస్సు-అంతరాయాలు చర్చ సర్వ సాధారణం. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తనకంటే పెద్దదైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, 51 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా విడాకులు , మళ్లి పెళ్లి వార్తల నడుమ 70 ఏళ్ల వయసులో కబీర్ బేడి నాలుగో పెళ్లి అదీ తన కూతురువయసున్న అమ్మాయిని చేసుకున్న వార్త చర్చల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాళ్లను వివాహం చేసుకోవడంపై చర్చను మళ్ళీ లేవనెత్తింది: ప్రేమలో వయస్సు నిజంగా ముఖ్యమా, లేదా పరస్పర అవగాహన ముఖ్యమైనదా? అనే హాట్ టాపిక్‌గా మారింది.
కబీర్ బేడి ప్రేమకథ
ప్రముఖ నటుడు కబీర్ బేడీ తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్ప నటుడు. వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలనెదుర్కొన్నాడు. 2016లో తన 70 పుట్టి రోజు సందర్భంగా తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్‌ను వివాహమాడటం ఆయన కుటుంబంలో కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే పదేళ్ల పరిచయం, ప్రేమ తరువాత తామీ నిర్ణయం తీసుకున్నామని పర్వీన్ తన జీవితంలోకి రావడంఎంతో సంతషాన్నిచ్చిందనీ అందుకే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశాడు. 2005లో వీరు తొలిసారి కలుసుకున్నారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, కబీర్ బేడి 2011లో రోమ్ పర్యటన సందర్భంగా ప్రపోజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో 2016, జనవరి 15న ముంబై సమీపంలోని అలీబాగ్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. నటి , కబీర్ బేడీ కుమార్తె పూజా బేడి కంటే పర్వీన్ ఐదేళ్లు చిన్నది.
ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ప్రేమకు నిజంగా వయసు అవసరమా?
ప్రేమ ఏ వయసులోనైనా వస్తుందనీ, ప్రేమకు హద్దులు లేవు; సామాజిక అంచనాలు లేదా వయస్సు తేడాలు దానిని పరిమితం చేయలేవని నిపుణులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నటి మలైకా అరోరా ఇటీవల స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో తానేమీ తలుపులు మూసుకోలేదని, జీవితం ఏ దశలోనైనా కొత్త అవకాశాం రావచ్చని స్పష్టం చేసింది.
నిపుణుల ప్రకారం వయస్సు వ్యత్యాసాలు అంతర్గతంగా సమస్యాత్మకమైనవి కావు. ఒక జంట కావాల్సింది ముఖ్యమైన భావోద్వేగ, మానసిక అనుకూలత. పరస్పర అవగాహన. ఇవి లేనపుడు మాత్రమే సమస్యలు సవాళ్లు వస్తాయనేది వారు చెబుతున్న మాట. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట, మిలింద్ సోమన్- అంకితా కోన్వర్ లాంటి సెలబ్రిటీల నిజమైన ప్రేమ బంధానికి ఇదే కారణమని ఉదాహరిస్తున్నారు.
పెళ్లి ఈ పునాదులపై
ఇద్దరి మధ్యా స్పష్టమైన కమ్యూనికేషన్
నమ్మకం, పరస్పర గౌరవం
భావోద్వేగ మద్దతు (emotional support)
ఈ ప్రధానమైన అంశాలు, విలువల ఆధారంగా చాలా జంటలు వారి వయస్సు అంతరంతో సంబంధం లేకుండా బలమైన బంధాన్ని కొనసాగించ గలుగుతారని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అవగాహనే ముఖ్యమని రిలేషన్‌షిప్ కౌన్సెలర్లు, సామాజిక, మానసిక నిపుణులు చెబుతున్నామాట.