
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.
తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.