‘ఆమె’ అర్థరాత్రి ఎందుకు బయటకు వెళ్లింది?: సీఎం మమత | Mamata Banerjee's Controversial Remarks on Kolkata Rape Case Spark Criticism | Sakshi
Sakshi News home page

‘ఆమె’ అర్థరాత్రి ఎందుకు బయటకు వెళ్లింది?: సీఎం మమత

Oct 12 2025 6:11 PM | Updated on Oct 12 2025 6:54 PM

How Was She Out At 12.30 am CM Mamata Banerjee

దుర్గాపూర్‌:   పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ)   వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అర్థరాత్రి సమయంలో సదరు విద్యా‍ర్థిని బయటకు వెళ్లడాన్ని మీడియా సమక్షంలో ప్రశ్నించారు. అసలు అర్థరాత్రి సమయంలో విద్యార్థులను క్యాంపస్‌ నుండి బయటకు ఎలా వెళ్లనిచ్చారని సీఎం మమతా నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదని, విద్యార్థుల క్యాంపస్‌లు అనేవి అత్యంత పకడ్భందీగా ఉండాలని ఆమె అన్నారు.  

 

ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్ని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామన్నారు.  అటవీ ప్రాంతంలో ఉన్న కాలేజీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. నైట్‌ కల్చర్‌కు విద్యార్థుల్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలేదేనని స్పష్టం చేశారు. మరో వైపు విద్యార్థులు కూడా తమని తాము రక్షించుకునేలా ఉండాలన్నారు. ఆ విద్యార్థిని కాలేజ్‌ క్యాంపస్‌ నుండి రాత్రి గం. 12,30 ని.లకు ఎలా వచ్చిందన్నారు మమత.  ఇ​క బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని, అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌,  మణిపూర్‌, బీహార్‌లలో కూడా అత్యాచార ఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 

మమత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. బాధితురాలికి న్యాయం జరిగే మాటను పక్కను పెట్టి, వేరే ఏవో కథలు సీఎం మమత చెబుతున్నారని ధ్వజమెత్తింది. ఆర్జీ కర్, సందేశ్‌ఖలి తర్వాత, ఇప్పుడు ఈ భయంకరమైన కేసులో న్యాయం కాకుండా, ఆమె బాధితురాలినే నిందిస్తున్నారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. అంటే సీఎం మమతా చెప్పేది ఏమిటంటే.. అర్థరాత్రి అమ్మాయిలనేవారు బయటకు వెళ్లొదని చెబుతున్నారా? అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:  

బెంగాల్‌లో మరో ఘోరం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement