బెంగాల్‌లో బంగ్లాదేశీ నటి, మోడల్‌ అరెస్ట్‌.. కారణం ఇదే.. | Bangladeshi Model Shanta Pal Arrested In Kolkata With Fake Aadhar And Other Indian Documents | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బంగ్లాదేశీ నటి, మోడల్‌ అరెస్ట్‌.. కారణం ఇదే..

Aug 1 2025 8:13 AM | Updated on Aug 1 2025 9:51 AM

Bangladeshi model Shanta Pal arrested in Kolkata with fake Aadhar

కోల్‌కతా: దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్‌ శాంతా పాల్‌(28)ను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. శాంతా పాల్‌ను బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే, ఆమె.. నకిలీ ఆధార్‌ కార్డులతో కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. బంగ్లాదేశీ మోడల్‌ శాంతా పాల్‌ కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్‌ పోలీసులు.. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్‌లతో రెండు నకిలీ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్‌పోర్టులు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి. వాటన్నింటిని సీజ్‌ చేశారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన రెజెంట్‌ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగిగా పేర్కొంటా ఆమె పేరుతో ఉన్న ఐడీ కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్టున్నట్లు జారీచేసిన అడ్మిట్‌ కార్డును స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కోల్‌కతా జాయింట్‌ కమిషనర్‌ (క్రైమ్‌) రూపేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆమె 2024 చివరి నుంచి అక్కడ ఉంటుందని  తెలిపారు. ఓ వ్యక్తితో కలిసి అక్కడి వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఉండటానికి చెల్లుబాటు అయ్యే వీసాను చూపించలేదని వెల్లడించారు. కోల్‌కతా, బుద్వాన్‌ అడ్రస్‌లతో ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎలా పొందిందనే విషయమై ఆమెనుప ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డులు ఎలా ఇచ్చారనే విషయమై యూఏడీఏఐకి, ఓటరు, రేషన్‌ కార్డుల విషయమై ఎన్నికల కమిషన్‌, బెంగాల్‌ ఆహార మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్టు తెలిపారు.

మరోవైపు, విశ్వసనీయ సమాచారం మేరకు శాంతా పాల్‌ బంగ్లాదేశ్‌లో పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా టీవీ చానల్స్‌, పలు కార్యక్రమాలకు యాంకర్‌గా, పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement